ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ కే. వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో బుధవారం ఆమె మాట్లాడారు. ఏలూరు జిల్లాలో పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీల్లో 2939 పరిష్కరించారని, వాటిలో 2, 895 అర్జీలకు సంబంధించి ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయిని తెలుసుకున్నారని పేర్కొన్నారు.