ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా విద్యార్థిలకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదని సంబంధిత కళాశాలల యాజమాన్యాలను పగో జిల్లా కలెక్టర్ చదలవాడ ఆదేశించారు. జిల్లాలోని ఏ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.