జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నర్సాపురం ప్రభుత్వ ఆస్పత్రి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఉదయం నిర్వహించామని ఆ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనశ్రేణులు, పవన్ అభిమానులు ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని నాయకర్ విజ్ఞప్తి చేశారు.