నర్సాపురం: పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఎమ్మెస్పి అధ్యక్షులు తెన్నేటి
నర్సాపురం పట్టణానికి చెందిన మాజీ పోలీస్ అధికారి స్వర్గీయ మానేపల్లి జాకబ్ ముని మనవరాలు మానేపల్లి తబిత పుట్టినరోజు వేడుకలో సోమవారం రాత్రి మాదిగ సంక్షేమ పరిషత్ (ఎమ్మెస్పి) ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు తెన్నేటి సురేష్ మాదిగ పాల్గొని తబితను ఆశీర్వదించారు. ఆయనతో పాటు నియోజకవర్గ అధ్యక్షులు కొండేటి రాజు పాల్ మాదిగ, నరసాపురం మండల కార్యదర్శి ఉల్లంపర్తి వెంకటేష్ మాదిగ, మరియు సనమండ్ర డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.