పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ఇంచార్జ్ కార్య నిర్వహణ అధికారిగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీళ్లకంఠంను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా నీలకంఠం గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజును కలిశారు.