AP: అర్హత లేకపోయినా పింఛన్ అందుకుంటున్న వారిని తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నకిలీ సర్టిఫికెట్లతో చాలా మంది వికలాంగ పింఛన్లను తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 8,18,900 మంది వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టీమ్‌లను నియమించింది. వేరిఫికేషన్ టీమ్ లబ్ధిదారులను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.