
పెరవలి: 10 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు ఆదివారం పట్టుకున్నారు. మండలంలోని తూర్పు విప్పర్రు నుంచి రావులపాలెంకు ఐచర్ వ్యాన్లో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో సివిల్ సప్లైస్ డీటీ సుధీర్ రెడ్డి సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. 10 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్ను సీజ్ చేసి, 6ఏ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.