విజయవాడ జలవనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో అనంతపురం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం మంత్రి నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వారికి తెలియజేశారు.