పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి సమేత శివదేవ స్వామివారి దేవస్థానంలో కార్తీక ఆఖరి సోమవారం పురస్కరించుకొని తెల్లారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొని సంతానం లేని వారు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి కొబ్బరి మొక్క నాటితే పిల్లలు పుడతారని ఇక్కడ భక్తులు నమ్మకంగా భావిస్తారు.