ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో సీట్లు

64చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో సీట్లు
బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. మనేంద్రరావు శనివారం తెలిపారు. BA హానర్స్( మేజర్ పొలిటికల్ సైన్స్, మైనర్ ఎకనామిక్స్ ), B. Com హానర్స్ (మేజర్ కామర్స్, మైనర్ కంప్యూటర్ అప్లికేషన్స్), B. Sc హానర్స్ (మేజర్ జువాలజీ, మైనర్ బొటనీ) కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్