తాడేపల్లిగూడెంలో వ్యక్తి హత్య కలకలం

79చూసినవారు
తాడేపల్లిగూడెంలో వ్యక్తి హత్య కలకలం
తాడేపల్లిగూడెం పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. పట్టణానికి చెందిన మనబాల రాజేష్ (35) 4వ వార్డులో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 1వ తేదీ రాత్రి ఇంటి బయట రక్తపు మడుగులో గాయాలతో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలు ఆధారాలు సేకరిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్