ఐదు రోజులపాటు రైల్వే గేటు మూసివేత

70చూసినవారు
ఐదు రోజులపాటు రైల్వే గేటు మూసివేత
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలోని భీమవరం నుంచి పాలకొల్లు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రైల్వేగేట్‌ను ఐదు రోజులు పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రైల్వే గేట్ మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. కావున ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని కోరారు.

సంబంధిత పోస్ట్