గోపాలపురం: డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పి
ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం ఐ. ఎస్ జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి , జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత చర్యలు చేపట్టారు.