Oct 20, 2024, 08:10 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
Oct 20, 2024, 08:10 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని రెండవ ఫ్లోర్లో గల జనరల్ వార్డులో షార్ట్ సర్క్యూట్ తో ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలు వార్డులో వ్యాపించడంతో వైద్యులు, రోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే రోగులను వార్డు నుండి బయటకు పంపించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు.