Dec 21, 2024, 09:12 IST/
కొడంగల్‌లో ఫార్మా సిటీ ఉండకూడదా?: CM రేవంత్
Dec 21, 2024, 09:12 IST
ఎయిర్పోర్ట్ సమీపంలో వేల కోట్ల విలువ చేసే భూముల్లో ఫార్మా సిటీ పెట్టొచ్చు గానీ.. కొడంగల్‌లో ఉండకూడదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 'కొడంగల్‌లో 1300 ఎకరాల భూ సేకరణ చేసి పరిశ్రమలు పెడదామని అనుకున్నా. నా మీద దాడి చేసినా పట్టించుకునేవాడిని కాదు.. కలెక్టర్‌పై దాడి చేస్తే ఊరుకోవాలా? కోట్లు ఖర్చుపెట్టి అధికారుల మీద దాడి చేయించారు. అధికారులను చంపేంత పని చేశారు. కొడంగల్‌లో పరిశ్రమలు పెట్టొద్దా? ఉద్యోగాలు రావద్దా?' అని ప్రశ్నించారు.