జీలుగుమిల్లి: ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ట్రైనింగ్ కార్యక్రమం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీలలో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ స్ట్రాలను ప్రదర్శించారు. అనంతరం ఎంపీడీవో వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని గ్రామ పంచాయతీలలో వర్మీ కంపోస్టింగ్ సక్రమంగా జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.