సిపిఎస్ రద్దుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ కోసం పోరాడిన ఉద్యోగులపై అక్రమ కేసులను రద్దు చేయించాలని ఉపాధ్యాయ సంఘ నేతలు ఆదివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జీలుగుమిల్లిలో ఆయన ఇంటివద్ద కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ సిపిఎస్ రద్దు కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.