స్కూల్‌ మానేసి టీవీ చూస్తున్న విద్యార్థి.. టీచర్ సడన్ ఎంట్రీ (వీడియో)

65చూసినవారు
ఒక విద్యార్థి రెండు రోజులు స్కూల్ డుమ్మా కొట్టడంతో.. అతడి టీచర్ ఏకంగా ఇంటికే వచ్చేశాడు. ఆ సమయంలో విద్యార్థి చక్కగా మంచం మీద పడుకుని టీవీ చూస్తున్నాడు. ఒక్కసారిగా టీచర్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విద్యార్థి షాకయ్యాడు. వెంటనే టీచర్ స్కూలుకు ఎందుకు రాలేదని ఆ విద్యార్థిని ప్రశ్నించాడు. దానికి విద్యార్థి నీళ్లు నమిలాడు. సరే, త్వరగా రెడీ అయ్యి పద అంటూ ఆ టీచర్ విద్యార్థిని స్కూలుకి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్