మొగల్తూరులో చిరంజీవి ఇంటిని సందర్శించిన జానీ మాస్టర్
మొగల్తూరులో సినీ డాన్స్ మాస్టర్ జానీ సందడి చేశారు. సోమవారం జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ తరఫున ఎన్నికల ప్రచారానికి మొగల్తూరు వచ్చిన జానీ మాస్టర్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మొగల్తూరు దయల్ దాస్ పేట నందు ముస్లిం సోదరులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం మొగల్తూరులోని చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి జీవించిన ఇంటిని సందర్శించి జానీ మాస్టర్ ఆనందం వ్యక్తం చేశారు.