చిరుతపులి దాడిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

586చూసినవారు
చిరుతపులి దాడిలో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
యూపీలోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిరుతపులి దాడిలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మల్కాపూర్ గ్రామంలో తాన్య(8) అనే చిన్నారి పశువుల మేత కోసం తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లింది. చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసింది. గ్రామస్థులు కర్రలతో చిరుతను తరమడంతో.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్