Jan 03, 2025, 15:01 IST/
ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సీఎం రేవంత్ (వీడియో)
Jan 03, 2025, 15:01 IST
తెలంగాణ మణిహారం రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులు, అధికారులతో ఆర్ఆర్ఆర్ భూసేకరణపై సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందుకోసం అటవీ-ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించుకోవాలని సీఎం చెప్పారు.