Mar 29, 2025, 14:03 IST/
రిజర్వేషన్ల పెంపునకు బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది: కవిత
Mar 29, 2025, 14:03 IST
తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన కులసర్వేలో బీసీల జనాభా తగ్గించి, ఓసీల జనాభా పెంచినట్లు ఆరోపించారు. ప్రభుత్వం గ్రామాల వారీగా జనాభా లెక్కలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తోందని అన్నారు.