Oct 16, 2024, 10:10 IST/
INDvsNZ.. తొలి రోజు ఆట రద్దు
Oct 16, 2024, 10:10 IST
బెంగళూరు వేదికగా జరగాల్సిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించడంతో తొలి రోజు టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. రోజంతా వర్షం కురుస్తూనే ఉండడంతో కొన్ని ఓవర్లు కూడా పడవని నిర్ధారించిన అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక రానున్న రోజుల్లో కూడా బెంగళూరులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.