Dec 18, 2024, 17:12 IST/
తెలంగాణలో 'గజగజ'.. ఆ జిల్లాలో స్కూళ్ల వేళల్లో మార్పు
Dec 18, 2024, 17:12 IST
తెలంగాణలో రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉ.9.40 నుంచి సా. 4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉ.9.15 నుంచి సా. 4.15 వరకు స్కూళ్లు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, టైమింగ్స్ మార్చాలని పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు.