Sep 23, 2024, 00:09 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
రిమ్స్ లో తలసీమియా బాధితులకు సౌకర్యాలు కల్పించాలి
Sep 23, 2024, 00:09 IST
తలసీమియా బాధితులకు ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తలసీమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ కోరారు. ఈ విషయమై జిల్లా కేంద్రంలో ఎంపీ గోడం నగేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలన్నారు. బాధితులకు ఇన్ఫ్యూజన్ పంపులు, డేస్వరాల్ సూది మందును ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా అందించాలని వారు కోరారు.