అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీదేవిశరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం సందర్బంగా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో వెంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి & శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయాల నందు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకొని, తీర్ధ ప్రసాదలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.