కుంటాల: బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

57చూసినవారు
బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లోకేశ్వరం మండలం గడ్చందా గ్రామానికి చెందిన శ్రీను బైక్ పై నర్సాపూర్ (జి) మండలం చాక్పల్లి నుంచి గడ్చందా వెళ్తుండగా అర్లి వద్ద రోడ్డు పై ఉన్న గుంతను తప్పించబోయి ఎదురుగా వెళ్తున్న ఆటోను ఢీ కొన్నాడు. దీంతో కాలికి తీవ్ర గాయాలు కాగ ఆటోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్