హర్యానాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. అధికార కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 59 స్థానాలు గెలుచుకుని పగ్గాలు దక్కించుకోనుందని తెలిపింది. కాగా, పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.