నిడమర్రు: జిల్లా స్థాయి ఆన్లైన్ పోటీలో విద్యార్థుల ప్రతిభ
సర్వోదయ మండలి జిల్లా స్థాయి ఆన్ లైన్ వ్యాసరచన, కవిత్వం, కథల పోటీల్లో నిడమర్రు మండలం చిననిండ్రకొలను హైస్కూల్ విద్యార్థులు చొక్కాకుల శరణ్య, పొత్తూరి శ్రీ భవిత, రొక్కాల సంతోష్ కుమార్ విజేతలుగా నిలిచారని హెచ్ఎం సత్యన్నారాయణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ అమ్మాయిల పట్ల వివక్షతో విపత్తు, స్వర్ణాంధ్ర విద్యతోనే సాధ్యం , స్వర్ణాం పై కవిత అంశాల్లో తమ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారన్నారు.