కొడంగల్ లగచర్ల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జరీ చేసింది. ఢిల్లీకి వెళ్లిన ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాలు సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.