ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఎన్‌జీఈఎల్ - ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది. ఎన్టీపీసీ రాష్ట్రంలో రూ.1.87లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి 25 ఏళ్లలో రూ.20, 620కోట్ల ఆదాయం సమకూరనుంది. 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.