రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్ షాపుల్లో పంపణీ చేసే వస్తువుల సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించింది. అసలైన లబ్దిదారులకు నష్టం జరగకుండా, వారికి సరఫరా చేసే వస్తువుల నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతోపాటు నకిలీ రేషన్ కార్డులను ఏరివేసి, రేషన్ దుకాణాల్లో పంపణీ చేసే వస్తువుల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించింది.