పెనుమంట్ర: సుబ్రమణ్య స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో స్వయంభువు గా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకున్నారు. జుత్తిగ, పెనుమంట్ర, నత్తా రామేశ్వరం, మల్లిపూడి గ్రామాల ప్రజలు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.