పెనుమంట్ర: సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా బత్తుల విజయకుమార్
పెనుమంట్ర సిపిఎం గ్రామ శాఖ మహాసభ మంగం సూర్యనారాయణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ మహాసభకు ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్ నాయకులు కేత వెంకట్రావు పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో మృతి చెందిన పార్టీ సభ్యులకు నివాళులర్పించారు. శాఖ కార్యదర్శిగా మరల బత్తుల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాఖా కార్యదర్శి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, గ్రామ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీగా కృషి చేస్తామని తెలియజేశారు.