మురుగు నీరుని త్రాగి ప్రాణాలను బలి చేసుకోలేము
నాలుగు నెలలుగా సుద్ధ నీరుతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఏలూరు జిల్లా, టి నరసాపురం మండలం, తిరుమలదేవి పేట గ్రామపంచాయతీ ప్రధాన కేంద్రంలోని ఎస్సీ పేటలోని ప్రజలకు సుద్ధ నీరు నుండి మురుగనీరు సరఫరా అవడంతో ఆగ్రహించిన ప్రజలు మురుగు నీరుని త్రాగి ప్రాణాలను బలి చేసుకోలేమంటూ తిరుమలదేవి పేట ఆర్ అండ్ బి ప్రధాన రహదారి పై మంగళవారం నిరసన తెలియజేశారు.