Dec 12, 2024, 13:12 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
మావల: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
Dec 12, 2024, 13:12 IST
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మావల ఏఈ జనార్ధన్ రెడ్డి అన్నారు. మావల మండల కేంద్రంలోని కొత్తవాడలో కేవీఏ 63 ట్రాన్స్ఫార్మర్ను గురువారం ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా కాలనీలో సింగిల్ లైన్ ఉండడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు ఏఈ పేర్కొన్నారు.