తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ అప్గ్రేడేషన్ 16వ తేదీ ఉదయానికి ముగియనుంది. దీంతో ఈ నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవు. అప్గ్రేడేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పోర్టల్ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.