వీరవాసరం మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కొణితివాడ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమత్తులు కారణంగా వీరవాసరం మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ ఈఈ మధుకుమార్ ఒక ప్రకటన లో తెలియచేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9: 00 గంటల నుంచి, మధ్యాహ్నం 1: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.