వీరవాసరంలో భారీ వర్షం
వీరవాసరం మండలంలో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. కాగా గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మంగళవారం కురిసిన వర్షానికి ఉపశమనం లభించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు.