ఆ సాప్ట్‌వేర్‌ ఆచూకీ ఎక్క‌డ..?

580చూసినవారు
ఆ సాప్ట్‌వేర్‌ ఆచూకీ ఎక్క‌డ..?
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం విద్యుత్ నగర్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి పైడి సుధీర్ రెండేళ్ల క్రితం బెంగుళూరులో అదృశ్య‌మైన విష‌యం తెలిసిందే. వాట్సాప్ న్యూడ్ వీడియో వల్ల సుధీర్‌ ట్రాప్‌కు గుర‌య్యాడు. ఆ వీడియోతో మోస‌గాళ్లు సుధీర్‌ను డ‌బ్బులు డిమాండ్ చేశారు. అవమానంగా భావించిన సుధీర్‌ 2022 జులై 26న ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. రెండు సంవత్సరాలు అవుతున్నా సుధీర్ ఆచూకీ దొర‌క‌లేదు. సుధీర్ ఆచూకీ కోసం బెంగళూరులో మిస్సింగ్ కేసు సైతం న‌మోదు చేశారు.

ట్యాగ్స్ :