ప్రపంచ ఆకలి సూచీలో 105వ స్థానంలో భారత్‌

59చూసినవారు
ప్రపంచ ఆకలి సూచీలో 105వ స్థానంలో భారత్‌
భారత్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. 2024-ప్రపంచ ఆకలి సూచీలో 27.3 స్కోర్‌తో దేశం 105వ స్థానం దక్కించుకుని ‘సీరియస్‌’ కేటగిరీలో ఉండడం గమనార్హం. ఈ కేటగిరీలో మొత్తం 42 దేశాలు ఉండగా పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు భారత్‌ కంటే మెరుగైన కేటగిరీలో ఉండడం విశేషం. తాజాగా అంతర్జాతీయ మానవతావాద సంస్థలు ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్‌ఐ)ని అంచనా వేశాయి. పోషకాహార లోపం, చిన్నపిల్లల మరణాలు వంటివి ఆధారంగా చేసుకుని మొత్తం 127 దేశాల్లో పరిస్థితిని వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్