మన దేశంలో ప్రజా ప్రతినిధులు పార్టీ ద్వారా గెలుస్తారు. లేదా ఇండిపెండెంట్‌గా గెలుస్తారు. కానీ ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ సమావేశాలకు అటెండ్ కావడం అన్నది మాత్రం భలే తమాషా రాజకీయమని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో ఇద్దరు లోక్ సభ ఎంపీల వ్యవహార శైలి తీరు ఇలాగే ఉంది. ఎంపీలు సీఎం రమేష్ (బీజేపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన) ఇద్దరూ వారి పార్టీల సమావేశాలకు కాకుండా టీడీపీ పార్టీ సమావేశాలకు హాజరవ్వటం, చంద్రబాబుకు పెద్దపీట వేయడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.