AP: పారిశుద్ధ్య కార్మికులకు గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే బకాయిలు చెల్లించిందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. శనివారం గంటూరు జిల్లా నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా నది వరదల సమయంలో ప్రజలకు సాయంగా నిలబడ్డారన్నారు. జీతాలు పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయని, కచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు.