AP: తిరుపతి చరిత్రలో ఎప్పుడూ జరగని దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఘటనపై ఎలాంటి దీక్షలు చేస్తారని ప్రశ్నించారు.