పచ్చి బఠాణీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా రావు. పచ్చి బఠాణీలు పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి వాటి నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి. గర్భిణీలకు అవసరమైన ఫోలేట్ దీనిలో ఉంటుంది. దీంతో కడుపులో బిడ్డ మెదడు, వెన్నెముక బాగా అభివృద్ధి చెందుతాయి. పచ్చి బఠాణీలను తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి.