విజయవాడలో సాధారణస్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే ఉంటానని సీఎం చంద్రబాబు తాజాగా స్పష్టం చేశారు. దీంతో విజయవాడ కలెక్టరేట్ సీఎం.. తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం బస్సు కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. అవసరమైతే ఇవాళ బస్సులోనే సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యలు వేగవంతం కావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.