AP: TDP కార్యకర్తలపై YCP కార్యకర్తలు దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో చోటుచేసుకుంది. నల్లతిమ్మాయపల్లిలో గత ఎన్నికల్లో TDP ఏజెంట్‌గా వెంకట సుబ్బారెడ్డి కూర్చున్నారని కక్షకట్టినట్లు తెలుస్తోంది. YCPకి చెందిన మీనిగ నాగూరు కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని వెంకట సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. TDPకి చెందిన లక్ష్మమ్మ కుటుంబంపై కూడా దాడికి పాల్పడినట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.