పోలవరం ప్రాజెక్టులో వేగం పుంజుకుంది. ఇటీవల సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించి పనులను వేగవంతం చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్ట్‌లో కీలకమైన గ్యాప్-1 రాక్-ఫిల్ డ్యామ్ పనులకు అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ అధికారులు పూజలు చేసి పనులను ప్రారంభించారు.