తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయాయి. ఇటీవల నిర్వహించిన నమూనా పరీక్షల ఆధారంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అధికారులు చనిపోయిన కోళ్లను జేసీబీతో పూడ్చి పెట్టి, గుడ్ల అమ్మకంపై నిషేధం విధించారు. దీంతో అధికారులు పరిస్థితిని బట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.