చైనాలో ఆ దేశ పౌరులతో అమెరికా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రేమ, లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దంటూ అమెరికా నిషేధం విధించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.